Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, September 28, 2013

2వ దినవృత్తాంతములు 16

2Ch 16:1  ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా 
2Ch 16:2  ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి 
2Ch 16:3  నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపి యున్నాను, ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను. 
2Ch 16:4  బెన్హదదు రాజైన ఆసా మాట అంగీ కరించి, తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణముల లోని కొట్లను కొల్లపెట్టిరి. 
2Ch 16:5  బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయు చున్న పని చాలించెను. 
2Ch 16:6  అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించు చుండిన రామాపట్టణపు రాళ్లను దూలములను తీసికొని వచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకార పురములుగా కట్టించెను. 
2Ch 16:7  ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెనునీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొ నక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను. 
2Ch 16:8  బహు విస్తారమైన రథము లును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతి కప్పగించెను. 
2Ch 16:9  తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. 
2Ch 16:10  ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహ ములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను. 
2Ch 16:11  ఆసా చేసిన కార్యము లన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. 
2Ch 16:12  ఆసా తన యేలుబడియందు ముప్పది తొ మ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను. 
2Ch 16:13  ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా 
2Ch 16:14  అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించు కొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి. 

No comments:

Post a Comment